తెలుగు పండుగలు 2026 మార్చి వ్రతాలు & ఉపవాసాలు

మార్చి 2026 నెల తెలుగు వారికి ఆధ్యాత్మికంగా మరియు సాంస్కృతికలగా చాలా విశేషమైనది. మార్చి 03న హోళీ పండుగ మరియు లక్ష్మీ జయంతిని జరుపుకోవడంతో ఈ నెల సందడి మొదలవుతుంది. ఈ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది. మార్చి 19న అత్యంత ముఖ్యమైన ‘ఉగాది’ పండుగ వస్తుంది, ఇది తెలుగు నూతన సంవత్సరానికి (పరాభవ నామ సంవత్సరం) ఆరంభం.

తెలుగు పండుగలు 2026 మార్చి
తేదీవారంపండుగలు & ముఖ్యమైన రోజులు
01.03.2026ఆదివారంప్రదోష వ్రతం (రవి ప్రదోషం)
03.03.2026మంగళవారంపౌర్ణమి, పౌర్ణమి వ్రతం, వసంత పూర్ణిమ, హోలికా దహన్, చోటీ హోలీ, హోళీ పండుగ, చైతన్య మహాప్రభు జయంతి, లక్ష్మీ జయంతి, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి, సంపూర్ణ చంద్రగ్రహణం (భారతదేశంలో పాక్షిక ప్రభావం)
04.03.2026బుధవారంపూర్వాభాద్ర కార్తె
06.03.2026శుక్రవారంసంకటహర చతుర్థి (బాలచంద్ర)
08.03.2026ఆదివారంరంగ పంచమి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం
10.03.2026మంగళవారంశీతల సప్తమి, హజ్రత్ అలీ (RA) జయంతి (తెలంగాణ)
11.03.2026బుధవారంశీతల అష్టమి (శీతలాష్టమి), కాలాష్టమి
13.03.2026శుక్రవారంజుమాతుల్‌-విదా
14.03.2026శనివారంస్వామి దయానంద సరస్వతి జయంతి
15.03.2026ఆదివారంమీన సంక్రమణం, పాపమోచని ఏకాదశి, షబ్-ఎ-ఖదర్ (ఆంధ్రప్రదేశ్)
16.03.2026సోమవారంప్రదోష వ్రతం (సోమ ప్రదోషం), పొట్టి శ్రీరాములు జయంతి
17.03.2026మంగళవారంమాస శివరాత్రి, షబ్-ఎ-ఖదర్ (తెలంగాణ)
18.03.2026బుధవారందర్శ అమావాస్య, ఉత్తరాభాద్ర కార్తె
19.03.2026గురువారంఉగాది, తెలుగు నూతన సంవత్సరం, ఫాల్గుణ అమావాస్య, చైత్రమాసము ప్రారంభం, వసంత నవరాత్రులు ప్రారంభం, వసంత ఋతువు ప్రారంభం
20.03.2026శుక్రవారంచంద్రోదయం, రంజాన్ (ఆంధ్రప్రదేశ్)
21.03.2026శనివారంమత్స్య జయంతి, గౌరీ పూజ, రంజాన్ (తెలంగాణ), రమదాన్ (ఈద్-ఉల్-ఫితర్)
22.03.2026ఆదివారంచతుర్థి వ్రతం, రంజాన్ తరువాతి రోజు (తెలంగాణ)
23.03.2026సోమవారంసోమవారం వ్రతం, లక్ష్మీ పంచమి, శ్రీ పంచమి
24.03.2026మంగళవారంస్కంద షష్టి, రోహిణి వ్రతం
26.03.2026గురువారందుర్గాష్టమి వ్రతం
27.03.2026శుక్రవారంశ్రీరామ నవమి, భద్రాచల శ్రీ సీతారామ కల్యాణం
28.03.2026శనివారంధర్మరాజు దశమి, పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి కల్యాణం
29.03.2026ఆదివారంకామద ఏకాదశి, వామన ద్వాదశి, తాటాకు ఆదివారం (పామ్ సండే), వాడపల్లి తీర్థం
30.03.2026సోమవారంప్రదోష వ్రతం (సోమ ప్రదోషం), అనంగ త్రయోదశి
31.03.2026మంగళవారంమహావీర్ జయంతి, రేవతి కార్తె
అదే రోజున వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. మార్చి 21న రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను జరుపుకుంటారు. మార్చి 27న భద్రాచలంలో సీతారాముల కళ్యాణంతో కూడిన ‘శ్రీరామ నవమి‘ వేడుకలు ఘనంగా జరుగుతాయి. మార్చి 29న క్రైస్తవ సోదరులు తాటాకు ఆదివారం (పామ్ సండే) జరుపుకోగా, మార్చి 31న జైనుల ముఖ్య పండుగ మహావీర్ జయంతితో ఈ నెల ముగుస్తుంది.